ఇప్పుడిక కిమ్ వంతు

November 15, 2014 | 01:31 PM | 42 Views
ప్రింట్ కామెంట్

ప్రతిసారి ఎవరో ఒక సెలబ్రిటీలతో కార్యక్రమాన్ని లాగించేస్తున్న కలర్స్ ఛానెల్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షో చూపు ఇప్పుడు హాలీవుడ్ వైపు మళ్లీంది. సీజన్-8 లో నటి, సింగర్ కిమ్ కర్దాషియన్ ను ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవలె ఓ మ్యాగ్జైన్ కోసం టాప్ లెస్ గా హాట్ హాట్ ఫోజులిచ్చి వార్తల్లో నిలిచిన ఈ భామను గనుక ప్రవేశపెడితే షో కు విపరీతమైన క్రేజ్ వస్తుందని నిర్వహాకులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కిమ్ తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇది వరకు సీజన్-2లో జేడ్ గూడీ, సీజన్-4లో కుస్తీ వీరుడు ది గ్రేట్ కాళీ, సీజన్-5లో నటి సన్నీలియోన్(అదే పార్న్ స్టార్ లేండీ), ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అండ్రూ సైమండ్స్ పాల్గొన్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం ఆరాటం ఎంత దూరమైన తీసుకెళ్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ