రజనీని గతం వెంటాడుతూనే ఉంటుందా?

May 05, 2016 | 01:01 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Kochadaiyaan-telugu-distributors-kabali-release-niharonline

ఒక సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ అంతా తన ఒక్కడి సోత్తు అన్నట్లు ఓ ప్రెస్ మీట్లు పెట్టి వాయించేస్తుంటారు మన హీరోలు. అదే ఫట్టాయితే తనకేం సంబంధం లేనట్లు రెమ్యునరేషన్ జేబులో వేసుకుని చల్లగా సైడ్ అయిపోతారు. కానీ, తలైవా రజనీకాంత్ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. తన సినిమాలతో నష్టపోయిన ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ ని కూడా వదిలిపెట్టారు. పైసాతో సహా వారికి ముట్టజెప్పి తన బాధ్యత తీర్చుకుంటాడు. ఆ తర్వాత అది కొందరు డిస్ట్రిబ్యూటర్లకు అలుసుగా మారింది. లింగ ఫ్లాప్ అయినప్పటికీ కమర్షియల్ గా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే తమ తమ ఏరియాల్లో నష్టాలు వచ్చాయని చెప్పుకుంటూ రజనీ దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశారు. అది అప్పట్లో సూపర్ స్టార్ కి పెద్ద తలనొప్పిగా మారింది.  

                        అది  పక్కనపెడితే రజనీ త్వరలో కబాలిగా మన ముందుకు రాబోతున్నాడు. మరోపక్క సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే కేవలం తెలుగు వర్షన్ కి మాత్రమే ఈ అభ్యంతరం లేవనెత్తారంట. ఇంతకీ విషయమేంటంటే... గతంలో రజనీ నటించిన 'విక్రమసింహా' (కొచ్చాడయాన్ తెలుగు వెర్షన్) సినిమా తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వారికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీంతో వీరికి 7 కోట్లు రిఫండ్ ఇవ్వడానికి చిత్ర నిర్మాతలు అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే, ఆ సొమ్ము మాత్రం ఇంతవరకు వీరికి ముట్టలేదు. దీంతో ఆ సొమ్ము ఇస్తేనే కబాలి విడుదలకు క్లియరెన్స్ ఇస్తామని, లేకపోతే అడ్డుకుని తీరతామని వారు చెబుతున్నారు. అంతేకాదు సమస్యను పరిష్కరించాలంటూ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు కూడా చేశారు. చూద్దాం మ్యాటర్ ఎక్కడిదాకా వెళ్తుందో...!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ