రంగుల ప్రపంచంలో రాణించిన వ్యక్తులు నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వింటున్నప్పుడు మనస్సు కలుక్కుమనక మానదు. కెరీర్ లో ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగి, అవసానదశలో దౌర్భాగ్యకరమైన జీవితాన్ని గడిపిన వారు ఎందరో. ఇటీవల థైరాయిడ్ సమస్యతో కోలీవుడ్ సీనియర్ నటుడు కుళ్ల ప్రభు (52) మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు పాతిక సంవత్సరాలు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. కేవలం ఒక్క వడివేలు పక్కనే వందకు పైగా సినిమాలో ఆయన కనిపించారు. అయితే చివరి దశలో మాత్రం ఘోరమైన పరిస్థితిని ఎదుర్కున్నారంట. ఇండస్ట్రీలో కనీస సాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదంట.
ఈ విషయమై ఆయన భార్య శోభ మీడియాతో మాట్లాడుతూ... 22 ఏళ్లుగా ఆయన మూవీ అసోషియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు. చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని స్టార్ హీరోల ఇంటి చుట్టూ తిరిగినప్పటికీ ఎలాంటి సాయం అందలేదని వివరించింది. కనీసం తన పిల్లల బాగోలు కోసం సౌత్ ఇండియన్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎంతో కొంత సాయం చేయాలని ఆమె కంటతడితో కొరుతుంది. పాతికేళ్లు తన నటనతో అలరించిన ఓ వ్యక్తి చివరి దశలో ఇలా ఆర్థిక ఇబ్బందులతో చనిపోవటం నిజంగా శోచనీయం.