కెరీర్ లో అప్పుడప్పుడే ఓనమాలు దిద్దుతున్న హీరోయిన్లు తమ ఫేవరెట్ హీరోలు ఏ మహేషో, ప్రభాసో అని చెబుతూ వారితో నటించాలని ఉందన్న కోరికను వెలువరుస్తారు. మీడియా అడగటం మూలానో, వారి ఎగ్జయిట్ మెంటో కానీ, అది సహజం. అలాగే హీరోలు కూడా ఓ స్టార్ హీరోయిన్ పేరు చెప్పి నవ్వేసుకుంటారు. కానీ, ఓ స్టార్ హీరోయిన్ ఓ యువ హీరోతో నటించాలని చెప్పడమే ఇక్కడ వార్త.
చెప్పింది ఎవరో కాదు మన మిల్కీ బ్యూటీ తమన్నా. ఇక ఆ హీరో ఎవరంటారా? ఈ మధ్య వరుస హిట్లతోపాటు సహజనటుడు అన్న ట్యాగ్ లైన్ తగిలించుకున్నాడే నాని. తమ్ము కెరీర్ లో ఇప్పటి వరకూ దాదాపు అందరు స్టార్ హీరోల తోనూ చేసింది. సేమ్ టైం కుర్ర హీరోలతో కూడా నటించింది కూడా. కానీ నేచురల్ స్టార్ నానితో మాత్రం చేయలేదు. నాని మంచి నటుడు. అతని సినిమాలన్నీ చూశా. కానీ, ఇప్పటి దాకా అతనితో పని చేసే అవకాశం రాలేదు. అదే బాధగా ఉంది అంటోంది తమన్నా. అవకాశం దొరికితే నానితో చేయడానికి ఎప్పుడైనా రెడీ అంటోంది. మరి నాని నటన చూశా? లేక అతని సక్సెస్ రేటు చూశా? ఇంతకీ ఏం చూసి తమన్నా అంతగా ఇంప్రెస్ అయ్యిందో?