మహేష్ బాబుతో వన్ చిత్రంలో జోడి కట్టి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి, ఆపై ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారిన ఈ బ్యూటీకి తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైందట. ఫ్లైట్ లో తన ముందు ఘోరం జరుగుతున్నా ఏం చేయలేకపోయానంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. అసలు ఏం జరిగింది. దానిని ఆమె ఎందుకంతా అవమానంలా ఎందుకు ఫీలవుతుంది.
ఆమె నటించిన ‘దిల్ వాలే’ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా పైరసీ ప్రస్తుతం మార్కెట్లో హల్చల్ చేస్తోంది. ఇటీవలే కృతి ఢిల్లీ వెళ్లారు. ఈ ఫ్లైట్ లో తన తోటి ప్రయాణికుడు ఈ సినిమా పైరసీ కాపీని మొబైల్లో చూస్తుండగా గమనించి... ‘ఇలా పైరసీ లో చూడటం కంటే థియేటర్లో చూస్తే మీరు మరింత ఎంజాయ్ చేస్తారు’ అంటూ చాలా రిక్వెస్ట్ చేసిందట. అయినా కృతి మాటలు ఆ వ్యక్తి పట్టించుకోకుండా ఆ సినిమా మొత్తం మొబైల్ లోనే చూసేసాడట. ఈ తతంగాన్ని ఫోటో తీసి, తన సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కృతి.
‘‘నా కళ్లెదుటే అతను పైరసీ కాపీ చూశాడు. తట్టుకోలేకపోయా. ఎంతోమంది కష్టంతో ఓ సినిమా రూపొందుతోంది. పైరసీ కాపీ చూసి, మా కష్టాన్ని వృథా చేయకండి. దయచేసి థియేటర్లకు వెళ్లి, సినిమా చూడండి అని బ్రతిమిలాడ ఫలితం లేకపోయింది’’ అంటూ పేర్కొంది. మొత్తానికి ఈ అమ్మడిని మాటలను లైట్ తీస్కున్న ప్రయాణికుడు తన పనితాను కానిచ్చాడట.