హీరోలు ఇలా... ఫ్యాన్సేమో అలా!

December 29, 2015 | 04:20 PM | 2 Views
ప్రింట్ కామెంట్
mahesh-babu-praises-NTR-for-nannaku-prematho-niharonline

సినీపరిశ్రమలో హీరోల మధ్య ఎంత మైత్రి కొనసాగుతుందో... వారి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే అంత భగ్గుమంటుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ వుడ్డులైనా  అన్నింట్లోనూ ఇదే సీన్.  అయితే ఇదేం ఈ మధ్య మొదలైంది కాదు. పాత తరం హీరోల్లో కూడా ఇది ఉండేది. ఎన్టీఆర్ ఎఎన్నార్ కృష్ణ లాంటి వారు  ఎంత స్నేహంగా మెలిగారో వారి అభిమానులు మాత్రం అప్పట్లో అంతలా కొట్టుకునేవారట. ఆ తర్వాత కూడా అది కొనసాగింది. చిరు, వెంకీ, బాలయ్య, నాగ్ ఫ్యాన్స్ మధ్య కూడా ఈ వార్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మూడో జనరేషన్లో కూడా అభిమానుల మధ్య అగ్గి అలానే ఉంది.  ప్రస్తుతం అగ్ర నటులుగా కొనసాగుతున్న మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య నడిచే వ్యవహారాలు మనకు తెలియనివి కాదు. ఫ్లెక్సీల దగ్గరి నుంచి ప్రతీదాన్ని విషయం చేసి గొడవలకు దిగటం కూడా చూశాం. కానీ, అభిమానులను వారు ఎంత వారిస్తున్న పద్దతి మాత్రం మార్చుకోవటం లేదు. ఓవైపు అలా వారు కొట్టుకుంటుంటే... హీరోలు మాత్రం ఒకరినోకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటూ ముందుకెళ్తున్నారు.

                             తాజాగా నాన్నకు ప్రేమతో... చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. చిత్ర ట్రైలర్ చూసిన మహేష్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మరీ అభినందించాడట. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, మహేష్ ని ఎంతగానో ఆకర్షించిందట. అంతేకాదు చిత్రం పెద్ద హిట్ కావాలని ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడట. టాప్ హీరోలుగా కొనసాగుతున్న వీరేమో ఇండస్ట్రీలో వైరాలు లేకుండా ఇలా కలుపుకునిపోతూ ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటుంటే.. కారణం లేకుండా చిన్న చిన్న విషయాలతో వారి అభిమానులు మాత్రం సీన్లు క్రియేట్ చేసి కొట్టేసుకుంటున్నారు మరీ.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ