మంచు లేడీ హాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుంది

May 07, 2016 | 02:31 PM | 4 Views
ప్రింట్ కామెంట్
manchu-lakshmi-in-hollywood-movie-niharonline

డైలాగ్ కింగ్ మోహన్ బాబు వారసత్వంలో కాస్త నటనపరంగా తనయుల కంటే కూతురు మంచు లక్ష్మీ యే బాగా రాణిస్తూ సక్సెస్ లు అందుకుంటుంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపైన షోలు చేస్తూ ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ఇప్పుడు త్వరలో హాలీవుడ్ చిత్రంలో కనిపించి అలరించనుంది. 'బాస్మతీ బ్లూస్' గా రాబోతున్న ఈ చిత్రంలో బ్రీ లార్సన్, డోనాల్డ్ సతర్లాండ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాను కనుగొన్న 'వరి' వంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకి వచ్చిన ఒక సైంటిస్ట్, ఇక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది అనేదే ఈ సినిమా కథాంశం. అందులో భాగంగా ఇక్కడ పరిచయమయ్యే ఇండియన్ సైంటిస్ట్ క్యారెక్టర్ లో మంచు లక్ష్మీ కనిపించబోతుందని సమాచారం.

గతంలో కొన్ని ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్, సీరియల్స్, షోలలో నటించిన అనుభవం మంచు లక్ష్మీకి ఉంది. అందుకే ఈ అవకాశం వెతికి మరీ ఆమెకు దక్కిందట. నిజానికి బాస్మతీ బ్లూస్ చిత్రం మూడేళ్ల కిందటే షూటింగ్ ప్రారంభం అయ్యింది. లక్ష్మీ పార్ట్ షూటింగ్ అప్పుడే కేరళలో అయిపోయింది కూడా. గతేడాది అమెరికా వెళ్లిన మంచు లక్ష్మీ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ ను పూర్తిచేసి వచ్చింది. డాన్ బారోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమయింది. ఇప్పుడు అన్ని సమస్యలు క్లియర్ కావటంతో త్వరలో విడుదల కానుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ