మహేష్ తో మాట్లాడించి ఉంటే బాగుండేది

May 07, 2016 | 12:52 PM | 3 Views
ప్రింట్ కామెంట్
vochindi-kada-avakasam-song-making-video-niharonline

హాట్ హాట్ సమ్మర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించేందుకు మహేష్ సిద్ధమైపోతున్నాడు. బ్రహ్మోత్సవం చిత్రంతో టాలీవుడ్ రికార్డులు బద్ధలు కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ఈరోజే ఆడియో వేడుక ఘనంగా జరగనుంది. ఇప్పటికే విడుదలైన వచ్చింది కదా అవకాశం సాంగ్ ఓవైపు అలరిస్తూ ఉంటే, ఇప్పుడు తాజాగా ఆ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది నిర్మాణ సంస్థ పీవీపీ. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక్క సమంత తప్ప మిగతా చిత్ర యూనిట్ చేసిన సందడి కనిపిస్తోంది.

                                                    ఓ సంగీత్ కార్యక్రమానుసారం చిత్రంలో వచ్చే ఈ పాటకు ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ తోట తరణి రామెజీ ఫిల్మ్ సిటీలో సెట్ సమకూర్చగా, రత్నవేలు అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించాడు. ఇక సిరివెన్నెల పదాలకు మిక్కీ జే మేయర్ స్వరాలు, రాజు సుందరం స్టెప్పులు సమకూర్చారు. వైట్ కోట్ లో, బ్లూ జీన్స్ లో మహేష్  హండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ వీడియో గురించి ఆయా టెక్నిషియన్స్ తో పాటు నటీనటులు కూడా వివరించారు. నరేష్, జయసుధ, రేవతి, లాంటి సీనియర్లు స్టెప్పులేశామని చెబుతుంటే,  ప్రణీత, చాందినీ చౌదరీ లాంటి స్టార్లు ఫుల్ జోష్ తో రూపుదిద్దుకున్న అంటూ పొగిడేస్తున్నారు. ఈ పాట చిత్రానికే హైలెట్ అవుతుందని వారంతా చెప్పటం బట్టి ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బ్రహ్మోత్సవం ఉండబోతుందని అర్థమవుతోంది. షారూఖ్ దిల్ వాలే టీం కూడా సందడి చేసింది ఈ పాట చిత్రీకరణ సమయంలోనే. ఆ వీడియోను కూడా ఇందులో చూడొచ్చు. అయితే ఇంత బాగా కుదిరిన ఈ వీడియో లో మహేష్ తో కూడా ఈ పాట గురించి ఓ రెండు ముక్కలు చెప్పించి ఉంటే బావుండు. ప్చ్...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ