సొట్ట బుగ్గల సుందరికి ఖాతాలో మరోకటి

May 07, 2016 | 05:41 PM | 2 Views
ప్రింట్ కామెంట్
lavanya-tripathi-sharwanand-niharonline

తొలినాళ్లలో దురదృష్టం పలకరించినా వరుస సక్సెస్ లతో తెలుగు తెరపై దూసుకుపోతుంది డెహ్రడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. 'భలే భలే మగాడివోయ్'  'సోగ్గాడే చిన్నినాయన' ఇచ్చిన కిక్కుతో మంచి మంచి సినిమాలు ఆమె ఖాతాలో వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం అల్లు శిరీష్ సరసన 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా చేస్తోన్న ఆమెని, కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుణ్ సరసన శీనువైట్లతో మిస్టర్ లో నటిస్తున్న లావణ్య ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసింది.

                 శర్వానంద్ కథానాయకుడిగా బీవీ ఎస్ ఎన్ ప్రసాద్ ఒక సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా చంద్రమోహన్ చింతాడ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. జూన్ 1వ తేదీ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరుస విజయాలతో వున్న శర్వానంద్ .. లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుండటం వలన, అంచనాలు పెరిగే అవకాశం వుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ