సమంత అతి ఆనందానికి కారణమేంటి?

May 07, 2016 | 04:43 PM | 3 Views
ప్రింట్ కామెంట్
samantha-happy-with-anasuya-role-niharonline

లేడి ఓరియంటల్ చిత్రాల్లో నటించడం తన కల అని ఎప్పటి నుంచో చెప్పుకోస్తుంది సౌత్ బ్యూటీ సమంత. దాదాపు 20 సినిమాల్లో నటించినప్పటికీ ఏ మాయ చేశావే, మనం చిత్రాల్లో తప్పించి ఎక్కడా ఆ ఛాయలు మనకు కనిపించవు కూడా. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ...ఆ'(అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ) తనకు ఆ దాహం తీరుస్తుంది అంటూ ఎగ్జైట్ అవుతోంది. సినిమాలో త్రివిక్రమ్ తన కోసం క్యారెక్టర్ తీర్చిదిద్దిన తీరు, తన నటన ఖచ్ఛితంగా హైలెట్ అవుతుందని చెబుతోంది. నటిగా తన స్థాయిని మరింత పెంచే చిత్రంగా 'అ ఆ' ఉంటుందని సన్నిహితులతో చెప్పుకుని సమంతా సంబరపడిపోతోందట. నవరసాలను పలికించే అవకాశం వున్న ఈ పాత్ర తనకి లభించడం అదృష్టమని అంటోందట. తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిన ఈ పాత్రకి , ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం వుందని చెబుతోందట. ఇప్పటికే విడుదల ఆల్బమ్స్ తాజాగా ఉండటంతో బాగా ఆదరణ లభిస్తుంది. అన్ని పనులు పూర్తయి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తుంది అ...ఆ. మొత్తానికి చెన్నై సోయగం అనున్నది సాధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ