సినీ ప్రపంచంలో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేం. నాజూకు నడుము సుందరి లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా అంతే. తొలిచిత్రం అందాల రాక్షసితో ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేకపోయింది ఈ డెహ్రడూన్ బ్యూటీ. తర్వాతి చిత్రం దూసుకెళ్తా ఆడినప్పటికీ ఆమెకొచ్చిన పేరు అంతంత మాత్రమే. అయితే భలే భలే మగాడివోయ్ తో లైఫ్ ఒక్కసారి యూ టర్న్ తీసుకుంది. అనుకోకుండా బిగ్గెస్ట్ హిట్ అయిన ఆ చిత్రం ఆమెకు పలు ఆఫర్లు తెచ్చిపెట్టాయి.
ఏకంగా నాగ్ సరసన 'సోగ్గాడే చిన్నినాయన' లో నటించేసింది. రెండు సినిమాలు భారీ విజయాన్ని అందించడంతో ఆమె కెరియర్ జోరు పెరిగింది. అయితే లచ్చిందేవీకి ఓ లెక్కుంది మాత్రం నిరాశే మిగిల్చింది. అయినా ఈ సొట్ట బుగ్గల సుందరి ఆఫర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు.
ఆల్రెడీ అల్లు శిరీశ్ జోడీగా పరుశురాం దర్శకత్వంలో 'శ్రీరస్తు - శుభమస్తు' సినిమా చేస్తోంది. అలాగే సందీప్ కిషన్ సరసన 'మాయావన్' సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుంది. ఇక సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న సినిమాలోను ఆమె ఎంపిక ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే మరో మెగా హీరో సినిమాకి కూడా ఓకే చెప్పిందని సమాచారం. వరుణ్ తేజ్ శీనువైట్ల దర్శకత్వలో తెరకెక్కబోయే లవ్ కమ్ కామెడీ చిత్రంలో ఈమెనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లావణ్య లైఫ్ ఏం టర్న్ తీసుకుందో కదా!