ముని హారర్ చిత్రం మొదలు పెట్టిన లారెన్స్ కు వరుసగా బాగా కలిసొస్తోంది. ముని తరువాత కాంచన పెద్ద సక్సెస్... ఆ తరువాత వచ్చిన గంగ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక లారెన్స్ మామూలుగానే నిలబడ్డం కష్టం... ఇక వరుస హిట్లతో గాలిలో ఫీట్లే చేసేస్తున్నాడు. ఈయనకు హర్రర్ చిత్రాలు బాగా సింక్ అయ్యాయి. ఇప్పుడు లారెన్స్ ననాలుగో సీక్వెల్ కి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకూ ఆయన చేసిన చిత్రాలన్నీ హిట్లే కావడంతో రేటు విపరీతంగా పెంచేశాడు. ఈ మూడు హారర్ కామెడీ చిత్రాలు కలెక్షన్ల పరంగా సొమ్ము రాబట్టడంతో నిర్మాతలు కూడా లారెన్స్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారట. తమిళంలో చేస్తున్న చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయడం వల్ల బాగానే లబ్దిపొందుతున్నాడులారెన్స్ . తాజా హర్రర్ చిత్రానికి ''నాగ '' అనే టైటిల్ తమిళం లో పెట్టగా తెలుగులో ''భైరవ '' అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారట . తెలుగు వర్షన్ కు 20 కోట్లని ఇప్పుడే ఫిక్స్ చేశాడట లారెన్స్.