దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, మూవీ మొగల్ రామానాయుడు కన్నుమూశారు. అపోలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మరణించారు. గత కొద్దికాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కాగా, మరొకరు హీరో విక్టరీ వెంకటేష్. రాముడు భీముడుతో ప్రారంభమైన ఆయన సినీ జీవితంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. భారతీయ భాషలన్నింటిలోనూ సినిమా నిర్మించిన గిన్నిస్ రికార్డు కు ఎక్కిన ఘనత కూడా రామానాయుడుదే. నిర్మాతగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన ఎంతోమంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు. సినీకళామతల్లికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన చేసిన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ తో సత్కరించింది.