తమిళ సినీ పరిశ్రమ సంచలన నిర్ణయం

March 09, 2015 | 06:06 PM | 27 Views
ప్రింట్ కామెంట్
tamila_producer_niharonline

దక్షిణాది సినిమాల్లో తమిళ సినీ పరిశ్రమకు ప్రత్యేక స్థానమే ఉంది. ఇక్కడి సినిమాలకు కేవలం తమిళనాడులోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. సింగపూర్, మలేషియా, యూఎస్ లాంటి దేశాల్లోనూ తమిళ చిత్రాలకు మార్కెట్ ఉంది. రజనీకాంత్, అజిత్, విజయ్, సూర్య వంటి హేమాహేమీలు భారత దేశంలోనే కాక విదేశాల్లో కూడా మంచి పేరు ఉంది. అయితే సినీ పరిశ్రమలో చాలా కాలం నుండి ఓ సమస్య వేళ్ళూనుకుని ఉంది. ముఖ్యంగా చిన్ని సినిమాలకు, పెద్ద స్టార్ల సినిమాలకు మధ్య నలుగుతోన్న సమస్య ఇది. భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ థియేటర్లను ఆక్రమిస్తుండడంతో చిన్న సినిమాలకు తక్కువ థియేటర్లు దొరుకుతున్నాయి దీంతో వారు నష్టాల పాలవుతుండడం ఓ పెద్ద సమస్యగా తయారైంది. దీంతో తమిళ నిర్మాతల మండలి ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 15 కోట్లు, అంతకు మించిన బడ్జెట్‌తో తెరకెక్కే భారీ సినిమాలు సంవత్సరంలో నిర్ణయించిన 10 సెలవు దినాల్లోనే (పండగలు, పబ్లిక్ హాలిడేస్)లో మాత్రమే విడుదల చేసుకోవాలని నిర్ణయించారు. ఈ లిస్టులో ఏప్రిల్ 14(తమిళ న్యూ ఇయర్), మే 1, ఆగస్టు 15, సెప్టెంబర్ 17, అక్టోబర్ 21, నవంబర్ 10(దీపావళి), డిసెంబర్ 25 లాంటివి ఉన్నాయి. ఈ నిర్ణయం చిన్న సినిమాలకు ప్రోత్సాహకంగా ఉంటుందని భావించారు. అయితే ఈ నిర్ణయం పెద్ద సినిమా నిర్మాతలను కలవరపెడుతోంది. ఒకే రోజు రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏమిటన్నది వీరి కలవరానికి కారణం. కావాల్సినన్ని థియేటర్లు దొరకక నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం పడుతున్నారు. చిన్న సినిమాల నిర్మాతలకు అనుకూలంగా ఉన్న ఈ నిర్ణయం ఏ మేరుకు సక్సెస్ అవుతుందో చూడాలి. తెలుగు సినిమాల్లో కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే చిన్న సినిమాల నిర్మాతలను ప్రోత్సహించినట్టవుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ