బ్రహ్మోత్సవంపై ఓ చిన్న క్లారిటీ

April 12, 2016 | 04:52 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Mahesh-Babu-Brahmotsavam-Movie-audio-date-fixed-niharonline

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న 'బ్రహ్మోత్సవం' సినిమా, షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చెట్టుగా'ఉగాది' రోజున విడుదల చేసిన ఫస్టులుక్ కి మాంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మహేశ్ అభిమానులంతా ఆడియో వేడుక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాటలను ఈ నెల 24న రిలీజ్ చేయాలని కొంతకాలం క్రితమే అనుకున్నారు. అయితే దర్శక నిర్మాతలు ఆ ఆలోచనను మార్చుకున్నారంట.  

                           మే 1న ఆడియోను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారనేది తాజా సమాచారం. అయితే వేదికలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. తిరుపతిలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడానికి పీవీపీ వారు భారీస్థాయిలో ఏర్పాట్లు చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే. ఆయన అందించిన ఆల్బమ్ మహేశ్ కెరియర్లోనే బెస్ట్ ఆల్బమ్ అవుతుందని అంటున్నారు. ఇందులో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తుండగా, సత్యరాజ్, రేవతి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ