అందంగా ఉండటం ఓ లెక్కైతే, ఆ అందానికి మరింత మెరుగు చేకూర్చడం మరో ఎత్తు. ఉన్న అందాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేసుకోవడం రిప్రజెంట్ చేసుకోవడంలో కాస్త తెలివి ప్రదర్శించాలి. ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అయిపోతుంది బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ. పాకిస్థాన్ సంతతికి చెందిన ఈ న్యూయార్క్ మోడల్ ఇండియన్ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త అందాలను కళాత్మకంగా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా రీబాక్ బ్రాండ్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది. ఆ మధ్య వెయిట్ తగ్గి పరిణితి చోప్రా యాక్షన్ సీక్వెన్స్ తో ఓ ఫోటో షూట్ చేసినట్లే ఈ భామ ఓ ఫోటో షూట్ చేసింది. ఫుల్ యాక్షన్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఫోటో షూట్ లో అందాలను కూడా సరిగ్గానే ఆవిష్కరించింది బ్యూటీ. బాలీవుడ్‌లో గతేడాది ఈ భామకు అవకాశాలు తగ్గిపోయినా.. ఈ ఏడాది మాత్రం హెరాఫెరీ3, హౌజ్ ఫుల్ 3, బాంజోలతో అమ్మడు బిజీ బిజీగా ఉంది.