కుటుంబ అప్యాయతలకు అద్దం పట్టేలా చిత్రాలను తెరకెక్కించటంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దిట్ట. కొన్ని పాటలు మినహాయించి బయటి ప్రదేశాలు కాకుండా మొత్తం అందమైన తెలుగు లోకేషన్లనే చిత్రాలను తీయటంలో శైలి వేరు. కానీ, బ్రహ్మెత్సవం విషయంలోనే మొదటిసారి ఆయన అవుడ్ డోర్ ను నమ్ముకున్నారు. మొన్నమొన్నటి దాకా ఆ చిత్ర షూటింగ్ ఊటీలో జరిగింది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఇక ఇప్పుడు బ్రహోత్సవం విజయవాడకి తరలనుందని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల ఛాయాగ్రాహకుడు రత్నవేలు తో కలిసి విజయవాడలోని కొన్ని లొకేషన్స్ ను కూడా పరిశీలించాడంట. సో... తదుపరి షెడ్యూల్ బెజవాడలోనేనని టాక్.
ఇక క్రిస్మస్ పండుగకి ఓ షెడ్యూల్ ముగియడంతో, ఈ సినిమా టీమ్ విరామం తీసుకుంది. ఆ తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఇక్కడ మెయిన్ లీడ్ సమంత షూటింగ్ లో కలుస్తుందని సమాచారం. అయితే తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో కాకుండా విజయవాడలో మొదలుపెడతారా? లేదంటే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసి విజయవాడ వెళతారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యమైన కథ పార్ట్ ని విజయవాడలోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ బాబుతో విజయవాడలో ఎలాంటి సందడి చేయించబోతున్నాడో!