కాస్త కంటెంట్ ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు యువనటుడు శర్వానంద్. తాజా చిత్రం ఎక్స్ ప్రెజ్ రాజా కూడా ఇదే కోవలోకి రాబోతుందట. ఇక సంక్రాంతి రేసులో బడా చిత్రాలకు పోటీగా యూవీ క్రియేషన్ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుంది. మంచి సబ్జెక్ట్ ఉన్న కథ కావటంతో ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. పదిరోజుల ముందుగానే ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకోవటం విశేషం. సెన్సార్ విషయానికొస్తే... హీరోయిన్ సురభి ఎక్స్ పోజింగ్ బాగానే ఉన్నప్పటికీ సెన్సార్ పెద్ద మనసుతో చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ట్రైలర్ లో ఆ అమ్మడు వేసిన డ్రెస్సులు, మరో హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా రెండో చిత్ర గండాన్ని దాటేందుకు ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్ తోపాటు ట్విస్ట్ లతో ఈ చిత్రాన్ని రూపుదిద్దాడట. ఒక్క ఫస్టాఫ్ లోనే ఆరు ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. సెకండాఫ్ ను పూర్తిస్థాయి వినోదాత్మకంగా తెరకెక్కించాడట. ముఖ్యంగా సినిమా మొత్తం శర్వానంద్, ప్రభాస్ శీను, సప్తగిరి మీదే ఆధారపడి ఉండనున్నట్లు తెలుస్తోంది.