భేషజాల్లేని టాప్ స్టార్ ప్రిన్స్...

July 20, 2015 | 12:50 PM | 3 Views
ప్రింట్ కామెంట్
sruthi_mahesh_srimanthudu_niharonline

మహేష్ బాబు అభిమానులు సమంత గొడవ అంత తేలిగ్గా మరిచిపోయేది కాదు. ప్రిన్స్ మహేష్ అభిమానులు ‘1 నేనొక్కడినే’ సినిమా లుక్స్ వచ్చినపుడు సమంత చేసిన కామెంట్ల వల్ల చాలా హర్ట్ అయ్యారు. ఎందుకంటే మహేష్ కు సినిమాకు బయట ఎవరి జోలికీ వెళ్ళడు... ఎటువంటి లూజ్ టాక్ చేయడు. స్టార్ హీరోనన్న భేషజం ఏ కోశానా చూపించడు. అలాంటిది సమంత చేసిన కామెంట్ల వల్ల శాంతంగా ఉండే మహేష్ అభిమానులు కూడా వయెలెంట్ అయ్యారు. మహేష్ బీచ్ లో నడుస్తుంటే అతడి కాళ్లను అందుకోవడానికి హీరోయిన్ కృతి సనన్ ట్రై చేసే ఫొటో... అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. మామూలు జనాలకు ఈ పోస్టర్ ఏమీ తేడాగా అనిపించలేదు కానీ, సమంతకు మాత్రం తప్పుగా అనిపించింది. సినిమా ఊసెత్తకుండా ఈ మధ్య ఓ పోస్టర్లో అమ్మాయిని దిగజారిపోయేలా చూపించారంటూ సెటైర్ వేసింది. ఇది తమ హీరోను ఉద్దేశించి అన్నమాటే అని మహేష్ ఫ్యాన్స్ సమంతపై తిరుగుబాటు చేశారు. ఈ గొడవ చల్లారడానికి చాలా కాలమే పట్టింది. చివరికి మహేష్ కూడా దీని మీద స్పందించాల్సి వచ్చింది. ఏదైనా ఉంటే తనకు నేరుగా చెప్పాల్సిందని సమంతను ఉద్దేశించి అన్నాడు ప్రిన్స్. కానీ తను సెట్లోగానీ, తోటి నటులతో గానీ చాలా కూల్ గా ఉంటాడు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఒకేలా చూస్తాడు. సిట్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఎలా నటించడానికైనా సిద్ధపడతాడు. సమంత కామెంట్లకు విరుద్ధంగా ‘శ్రీమంతుడు’లో ఓ పాటకు సంబంధించి రిలీజ్ చేసిన టీజర్ మళ్లీ ఈ గొడవను గుర్తుకు తెస్తోంది. ఇందులో ఓ చోట శ్రుతి మహేష్ పక్కపక్కన కూర్చుని ఉంటారు. శ్రుతి తన కాలిని వెనక్కి తీసుకుంటుంటే.. మహేష్ ఆ కాలిని పట్టుకున్నట్టు  చూపించారు. తనకు అమ్మాయిల విషయంలో వివక్ష భేషజాల్లాంటివేమీ ఉండవని, ఏదైనా సినిమా అవసరాలకు తగ్గట్లే ఉంటుందని చూపించినట్టుంది ఈ సీన్. ఇది సమంతకు కౌంటర్ ఇచ్చినట్టుగా అనుకుంటున్నారు కొందరు అభిమానులు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ