తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. అన్ని ప్యానెల్స్ లో పాపులర్ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు తన ఆధిపత్యం చూపించారు. స్టూడియో సెక్టార్, ప్రొడ్యూసర్స్ సెక్టార్, ఎగ్జిబిటర్స్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్‌లకు చెందిన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నిక ఫలితాలు ఆదివారం రాత్రే విడుదల చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా నిర్మాత డి.సురేష్‌బాబు, ఉపాధ్యక్షులుగా వి.వెంకటరమణరెడ్డి (దిల్ రాజు), ఎం.రమేష్, పి.కిరణ్.. కార్యదర్శులుగా కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కేవీవీ ప్రసాద్, సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. అలాగే...ఏలూరు సురేందర్‌రెడ్డి, ఎ.రామదాసు, శ్రీనివాసబాబు, జి.మహేశ్వరరెడ్డి, కేఎన్‌వీఎస్ గురుమూర్తి, పి.సాంబశివారెడ్డి, కోశాధికారిగా కొడాలి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాతలు డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, కె.ఎస్.రామారావు, ఆదిశేషగిరిరావు, వర్మ, దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సాగర్, ఎమ్మెల్యే, నిర్మాత మాగంటి పినాథ్, సినీ నటులు కె.అశోక్‌కుమార్, వేణుమాదవ్, ఝాన్సీ తదితరులు ఓటు వేశారు.