తేజ కామెంట్లను పట్టించుకోని మహేష్...

September 14, 2015 | 12:27 PM | 2 Views
ప్రింట్ కామెంట్
mahesh_babu_about_teja_comments_niharonline_(18)

ఇటీవల తేజ ప్రిన్స్ మహేష్ బాబు పై సంచలన కామెంట్స్ చేశాడు. ఒక్కడు సినిమా అప్పుడు లేని ఊరి దత్తత ఆలోచనలు ఇప్పుడెందుకొచ్చాయనీ... టాక్స్ తగ్గించుకోడానికి మహేష్ ఇలా  ఊరి దత్తత అంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారన్నాడు. దీనిపై మహేష్ ఫాన్స్ ఆయనకు వ్యతిరేకంగా చాలా కామెంట్లు చేశారు. ఆయనను దుమ్మెత్తి పోస్తున్నారు కూడా. తమ అభిమాన హీరోను అలా కమెంట్ చేస్తే ఎవరు మాత్రం సహిస్తారు. అయినా చేస్తున్న మంచి పనికి అభినందించాలి కానీ, అప్పుడెందుకు చేయలేదు... ఇప్పుడెందుకు చేస్తున్నాడనే కామెంట్ ఏంటి? శ్రీమంతుడు సినిమా అప్పుడే ఎందుకు తీయలేదంటే సమాధానం ఎవరు మాత్రం చెప్పగలరు? ఇదీ అంతే... కదా... అయితే తేజ కామెంట్ల పై మీ స్పందన ఏమిటని? మహేష్ బాబును కొందరడిగితే... ఆయన కామెంట్లకు నేనంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని, తనెందుకు ఇలా అన్నాడో అర్థరహితమని అన్నాడు. 
మహేష్ బాబు ఈ నెల 16 నుంచి బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గొన బోతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన 90 రోజులు కాల్షీట్లు ఇచ్చాడు. ఈ సినిమా నిర్మాతలు బ్రహ్మోత్సవం సినిమాను జనవరి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ