ఇటీవల మన తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో రిలీజ్ కావడం అక్కడ కూడా కలెక్షన్లు ఇక్కడికన్నా ఎక్కువగా వసూలు చేయడం, రికార్డులు సృష్టించడం జరుగుతోంది. సినిమా సక్సెస్ లకు అక్కడి మన తెలుగు వారి సహకారం ఎంతో ఉండడంతో... అక్కడివారి ఆనందం కోసం సినిమా ఇప్పుడు మన సినీ విజయోత్సవాలు, ఆడియోలు కూడా అక్కడ నిర్వహిస్తుండడం పరిపాటై పోయింది. అందుకే శ్రీమంతుడు విజయోత్సవాన్ని అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 24న ఈ విజయోత్సవాన్ని జరపబోతున్నారు. ఈ చిత్ర నిర్మాత యలమంచిలి రవిశంకర్ ఆదివారం విజయవాడలో మాట్లాడుతూ ''మహేష్‌బాబు ఆసక్తి మేరకు విజయోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. మహేష్ సినిమాలకు న్యూజెర్సీలో విపరీతమైన స్పందన ఉంది. అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో వేడుకలను అక్కడ నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు మహేష్‌బాబు, శ్రుతి హాసన్, జగపతిబాబు, దేవిశ్రీప్రసాద్‌తోపాటు చిత్ర యూనిట్ హాజరవుతుంది'' అని తెలిపారు. ఈ వేడుకలకు అక్కడివారు సుమారు 3 వేల మంది పాల్గొననున్నారని తెలిపారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ "ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని మేం కష్టపడిన దానికంటే ఎక్కువ సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద హిట్ చేసిన ఫ్యాన్స్‌కి మా టీమ్ తరఫున స్పెషల్ థ్యాంక్స్. '' అని చెప్పుకున్నారు. ఈ సినిమాను పలువురు ప్రముఖులు స్ఫూర్తిగా తీసుకుని ఊరిని దత్తత తీసుకోవడం అనే సమాజిక మార్పుకు కూడా ఈ చిత్ర బృందం చాలా ఆనందంగా ఉంది.