మహేష్ ఇంతకు ముందు పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటూ వచ్చాడు. ఒకప్పటిలా ఇప్పుడు పరిస్థితులు లేవని ఈయనకూ తెలిసొచ్చినట్టుంది. బాహుబలి ప్రభావం ఈయనపై కూడా పడింది. ఓపెనింగ్స్ లో రాబట్టుకుంటున్న కలెక్షన్ తరువాత ఉండడం లేదన్నది కూడా బాగా అర్థమైనట్టుంది. అందుకే ఇప్పుడు మహేష్ కూడా బాహుబలి స్టైల్ లో పబ్లిసిటీకి దిగిపోయారు. శ్రీమంతుడు సినిమాను మీడియాలో బాగా ప్రచారం చేసేందుకు నానా తంటాడు పడుతున్నాడు మహేష్. ఇంతకు ముందయితే సినిమా హిట్టయితేనే ప్రెస్ మీట్స్ పెట్టుకునేవాడు, ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. కానీ శ్రీమంతుడు విషయంలో తన పద్ధతిని మార్చుకునానడు. విడుదలవ్వడానికి ఇంకా 20 రోజులందునగా ఇప్పుడే మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సినిమా గురించి బాగానే చెప్పుకుంటున్నాడు. నిర్మాణ రంగంలో అడుగు పెడుతున్నాడు కాబట్టి ఇప్పటినుంచే కాస్త మీడియాతో మాట్లాడ్డం మొదలు పెట్టినట్టున్నాడు మహేష్. సినిమా పబ్లిసిటీతో పాటు, తన బిజినెస్ ప్లానింగ్స్ కూడా అమలు చేస్తున్నట్టున్నాడు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియాకు మహేష్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ప్రమోట్ చేయమంటూ నిర్మాతలకు కూడా సూచించాడట మహేష్. ఒక వైపు పైరసీ, మరో వైపు సినిమా తీయడంలో కాస్ట్ పెరుగుతున్న కారణంగా సినిమా బతికి బట్టకట్టాలంటే యూనిట్ మొత్తం పూనుకోవడం చాలా అవసరంగా ఇప్పుడు ప్రతి హీరో భావించడం కనిపిస్తోంది.