వెంకటేష్ సినిమాలను ఎంచుకోవడంలో ఆచీ తూచీ అడుగేస్తుంటారు. అందుకే ఆయన సినిమాలు మినిమమ్ కలెక్షన్లను రాబడుతుంటాయి. దృశ్యం తర్వాత వెంకటేష్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. ఈ చిత్రానికి దర్శకుడు 'ఓనమాలు', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'తో హిట్ దర్శకునిగా పేరు తెచ్చుకున్న క్రాంతిమాధవ్. ఇక సింహ, షాడో చిత్రాలు నిర్మించిన పరుచూరి ప్రసాద్, వెంకటేష్ హీరో యునైటెడ్ మూవీస్ సంస్థ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. క్రాంతిమాధవ్ కథ చెప్పడం, వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిపోయాయి. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించే అవకాశాలున్నాయని సమాచారం. 'లక్ష్మీ', 'తులసి' సినిమాలతో హిట్ పెయిర్ అనిపించుకొన్న ఈ జంట మళ్లీ నటించడం విశేషం. ఇది హిట్ పెయిర్ కావడంలో వల్ల ఈ జంటతో మళ్ళీ హిట్ ఇవ్వాలన్న ఆలోచనతో హీరోయిన్ ను నయనతారను ఎంపిక చేశారని ఫిల్మ్ నగర్ లో టాక్. నయనతార తమిళంలో 'మాయ' చిత్రంలో నటిస్తోంది. ఇదే చిత్రం తెలుగులో 'మయూరి'గా విడుదల కాబోతోంది.