సీతారతో కేక్ కట్ చేయిస్తున్న ప్రిన్స్

August 03, 2015 | 12:46 PM | 4 Views
ప్రింట్ కామెంట్
mahesh_dauther_sithara_3rd_bday_niharonline

ప్రిన్స్ మహేష్ సినిమాలను ఎంత ప్రేమిస్తాడో... కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. షూటింగు తరువాత తనకు ఇల్లు తప్ప మరో లోకం తెలియదట. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కృష్ణ గారు కూడా చెప్పారు. మరి పిల్లల పుట్టిన రోజులు మహేష్ ఎంత నిరాడంబరంగా జరుపుకుంటారో... అందులో అంత గొప్ప ఆనందం కూడా కనిపిస్తుంది. ఆగస్టు 2న సితార పుట్టిన రోజును ఇలా జరుపుకున్నట్టు నమ్రత సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేసింది. తమ పిల్లలతో ఉన్నప్పుడు మహేష్ ఎంత హ్యాపీగా ఉంటారో ఈ ఫొటోలను చూస్తే తెలుస్తుంది. సితార మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. మహేష్ తన గారాల కూతురితో దిగిన ఈ పిక్స్ చూస్తుంటే ఆయన ముఖంలో కోటి కాంతులు కనిపిస్తున్నాయి కదూ..!  సీతారకు నీహార్ ఆన్ లైన్ తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ