మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ విడుదలకు మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఆగస్టు 7న తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందు రాబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 31న మొదటి కాపీని సెన్సార్ కి పంపనున్నారు. అయితే మహేష్ బాబు మాత్రం ఎప్పుడూ లేనిది ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు మొదలు పెట్టారు. అలా ఓ ఇంటర్వ్యలో ఆయన ఈ సినిమా గురించిన ఆసక్తి కరమైన విషయాలతో పాటు కొన్ని పర్సనల్స్ కూడా చెప్పుకొచ్చారు. ఇంతవరకూ నటుడుగా కొనసాగిన ఆయన నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టినట్టు చెప్పారు. మరి డైరెక్టర్ గా కూడా మారే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ‘‘అసలు డైరెక్షన్ చెయ్యాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు, చెయ్యను కూడా. డైరెక్షన్ చెయ్యాలంటే స్పెషల్ స్కిల్స్ ఉండాలి. అది చాలా టఫ్ జాబ్. నేను యాక్టర్ గా హ్యాపీగా ఉన్నాను. నిర్మాతగా కూడా నాకు అనుభవం కావాలి. అందుకే నేను వేరే నిర్మాతలతో కలిసి పని చేస్తాను. అనుభవం వచ్చాక నిర్మాతగా సినిమాలు చేస్తాను. ఎందుకంటే న్యూ టాలెంట్ ని కనుగొని వారిని పరిచయం చేయడం అనేది చాలా పెద్ద భాద్యత’’ అన్నారు.. శ్రీమంతుడు సినిమా మంచి సక్సెస్ అవుతుందని మహేష్ బాబు చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు.