సెక్సీ భామ మల్లికా శరావత్ గులాబీ రంగు గౌనులో ఎర్ర తివాచీపై శనివారం ఒయ్యారం ఒలికించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఈసారి మల్లికా షరావత్ కు కూడా ఆహ్వానం అందింది. గత కొన్నేళ్లుగా మల్లికా శరావత్ ఈ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. ఆమె గాల్లో ముద్దులు విసురుతూ, చిరునవ్వులు చిందిస్తూ వీక్షకులను ఆకట్టుకుంది. మల్లిక మరో ఎట్రాక్షన్ ఏమిటంటే... ఆమె మెడలో అందమైన కంఠాభరణం. వజ్రాల నెక్సెస్. ఇది ఇంతలా ఆకట్టుకోడానికి గల కారణం దీని ఖరీదు 12 కోట్ల రూపాయలు. అయితే ఆమె దీన్ని గురించి మాట్లాడుతూ....‘‘ఈ ఖరీదైన ఆభరణం నాకు అందం తెచ్చిన మాట నిజమే కానీ, కేన్స్ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళే వరకూ దాన్ని కాపాడుకోవడం పెద్ద టాస్క్.... ఏది ఏమైనా నా మెడ అందాన్ని పెంచిన ఈ నెక్లెస్కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు’’ అన్నారు.