బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ రెండో రోజు ఎరుపు రంగు గౌనుతో సందడి చేశారు. 68వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు కత్రిన మొదటిసారిగా ఆహ్వానం అందుకుంది. కేన్స్ ఫెస్టివల్ లో రెండో రోజు మాడ్ మాక్స్ ఫ్యూరీ రోడ్ అనే హాలీవుడ్ ప్రీమియర్ షో కు హాజరయ్యారు. శుక్రవారం ఈ అందాల భామ రెడ్ కార్పెట్ పై మెరిసిపోయింది. పొడవైన ఆమె ఫిగర్ కు ఈ ఎరుపు రంగు లాంగ్ లేస్ ఫ్రాక్ చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తోంది. అదే రంగు లిప్ స్టిక్ తో సింపుల్ గా వదిలేసిన లాంగ్ హెయిర్ కు రెడ్ షేడింగ్ ఇచ్చారు. టోటల్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండో రోజు రెప్ కార్పెట్ పై ఈ బాలీవుడ్ భామ అద్భుతంగా హొయలొలికించింది.
బాలీవుడ్ యువ నటి సోనమ్ కపూర్‑, సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ కూడా కేన్స్ వెళ్లారు. శనివారం సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్ పై కేట్ వాక్ చేయనున్నారు. మరి ఈ ఫాషన్ ఐకాన్ ఏ డ్రెస్ తో మెరిసిపోతుందో వేచి చూద్దాం...