మమ్ముట్టి కొంప ముంచిన ఇందులేఖ

September 16, 2015 | 12:28 PM | 1 Views
ప్రింట్ కామెంట్
mammutti-indulekha-court-case-niharonline

సినిమా నటులు ఇప్పుడు రెండు చేతులా సంపాదించేస్తున్నారు. సినిమా మొత్తం కష్టపడితే ఎంత ముడుతుందో.. ఒక యాడ్ లో నటిస్తే అంతకంటే రెట్టింపు ఇస్తున్నారు. పైగా సినిమాకు కొన్ని నెలలు కష్టపడితే యాడ్స్ కోసం మాత్రం రెండు మూడు రోజులు పని చేస్తే చాలన్న ధీమాతో ఉన్నారు. దీంతో డబ్బుకు డబ్బు... సమయమూ కలిసొస్తుంది కదా...  కానీ ఈ మధ్య కాలంలో యాడ్స్ లో నటించడం వల్ల ఎన్ని చిక్కులో మహా మహా నటులే కోర్టు గడప తొక్కాలిస వస్తోంది. ఇప్పుడు ఆ సమస్యలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా చిక్కుకున్నారు. ముఖ్యంగా కేరళతో పాటు అక్షరాస్యత ఉన్న అన్ని రాష్ట్రాలలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని మమ్ముట్టి ఎదుర్కొంటున్న సమస్య వల్ల తెలుస్తోంది. వినియోగదారులలో ఎవేర్ నెస్ పెరిగాక అవకాశాలు వస్తున్నాయి కదా అని వాణిజ్య ప్రకటనల్లో నటిస్తుంటే... ఆపై కోర్టు మెట్లెక్కక తప్పదు. ఇటీవల మన సినీ నటులు సినిమాల కంటే యాడ్స్ లోనే ఎక్కువగా కన్పిస్తున్నారు. ఇంతకూ ఆయనను కోర్టుకు లాగిన యాడ్ ఏమిటంటే... ఇందులేఖ వైట్ సోప్ యాడ్ కు మమ్ముట్టి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ప్రకటనలో ఈ సోప్ వాడడం వల్ల చాలా అందంగా తయారవుతారని మమ్ముట్టి అనడమే ఈ చిక్కు తెచ్చి పెట్టింది. కేసు వేసిన వాడు నేను ఈ సోప్ వాడడం వల్ల అందంగా తయారవ్వలేదు... వినియోగదారులను తప్పుదారి పట్టించిన ఈ కంపెనీ తనకు 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడట. దీంతో కోర్టు సెప్టెంబర్ 22 న ముమ్మట్టిని, కంపెనీ రిప్రజెంటివ్ లను కలసి హాజరు కావాల్సిందిగా కోరింది. కోర్టుకు ఎక్కిన వారు కేరళలోని వాయినాడ్ జిల్లా లోని కె. ఛాతు ఈ కేసు ఫైల్ చేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ