జబర్దస్త్ షో లో ఈమె ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఏమిటి ? చాలా ఫ్రెండ్లీ ఈ షోలో ఉన్న వారందరితో కలిసి పోతుంది. ఎన్నిసెటైర్లు వేసినా నవ్వుతూ స్వకీరిస్తుంది. చంటి ‘అమ్మా నీ కోడలు తెలుగు బాగా మాట్లాడుతుందే...’ అన్నా... నవ్వుతూ కొట్టడానికి చంటి వెంట పడుతుందే తప్ప... ఎప్పుడూ ఏ విషయంలోనూ ఇష్యూ చేయలేదు. బహుషా సుమ తరువాత ఇంత ఫ్రెండ్లీ కలిసి పోయే యాంకర్ భామ మరెవరో కాదు రష్మీయే. అయితే ఈ అమ్మడు ఇప్పుడు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఈ షో అభిమానులను బాధించే అంశం. అవును జబర్దస్త్ షో తో బాగా పాపులర్ అయిన ఈ హాట్ భామ కు ఈ మధ్య వరుసగా సినిమాల అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే గుంటూరు టాకీస్ , చారుశీల సినిమాల్లో నటిస్తున్న ఈ భామకు ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తుండడం తో ఇక పై సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.