విడుదలకు ముందే మాంఝీ ఆన్ లైన్ లో

August 11, 2015 | 04:03 PM | 1 Views
ప్రింట్ కామెంట్
manjhi_the_mountain_man_niharonline

ఇప్పుడు కొత్తగా విడుదల కాబోతున్న సినిమాలను పైరసీ భూతం వెంటాడుతోంది.  ఇంతకు ముందులా థియేటర్లకు వెళ్ళి సినిమా చూసే వారి సంఖ్య తగ్గడంతో పాటు నిమిషాల్లో ఆన్ లైన్ లో సినిమాలు విడుదలవుతుండడంతో తమ పెట్టుబడికి గండిగొట్టే పైరసీని అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమాకు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. వెంటనే చర్య తీసుకోవడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సమస్య ఓ బాలీవుడ్ సినిమా విషయంలోనూ తలెత్తింది. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన  ‘మంఝీ-ది మౌంటేన్ మ్యాన్' సినిమా విడుదలకు ముందే ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. ఆగస్టు 21న ఈ సినిమా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తయ్యింది. దీంతో ఈ సినిమాను సెన్సార్ వారే లీక్ చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఆగస్టు 9వ తేదీ రాత్రి ఈ సినిమా ఆన్ లైన్ లో లీకైనట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మాంఝీ ఓ మంచి సినిమా. ఉదాత్తమైన కథాంశంతో తెరకెక్కింది. బీహార్ కు చెందిన మాంఝీ అనే వ్యక్తి జీవిత కథతో ఈ సినిమా రూపొందించారు.  ఇందులోని హీరో మాంఝీ అతను ఓ కొండ ప్రాంతంలో నివాసం ఉంటుంటాడు. ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యం ఉండదు. అతని భార్య అనారోగ్యంతో చనిపోతుంది. తనను వైద్యం కోసం పట్టణానికి ఆ కొండనెక్కి వెళ్లేలోపు ఆలస్యమై ఆమె చనిపోతుంది. తమ ఊరికి రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని వేడుకొని విసిగిపోయిన మాంఝీ తన భార్యలా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో కొండను తవ్వి దారిని నిర్మించేందుకు నడుంబిగిస్తాడు.  తనకు ఆ కొండ నుంచి రోడ్డు మార్గం వేయడానికి 22 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి స్ఫూర్తి దాయక నిజ జీవిత కథతో తెరకెక్కిన సినిమాను ఆన్ లైన్ లో విడుదల చేయడం ఎంత తప్పో ఫ్రీగా చూడాలని అనుకోవడం కూడా అంతే తప్పు. ఇంతకుముందు మలయాళ సినిమా ‘ప్రేమమ్’ను కూడా సెన్సార్ సభ్యులే పైరసీ చేయడం సంచలనం రేపింది. ప్రభుత్వ అధికారులే ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఇక సినిమాలను బతికించేదెవరని మూవీ మేకర్స్ ఆందోళన పడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ