మాయాబజార్ కు మరోగౌరవం

November 20, 2014 | 03:34 PM | 29 Views
ప్రింట్ కామెంట్

తెలుగు చలన చిత్రాలలో అద్భుత దృశ్య కావ్యం మాయాబజార్ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో టెక్ట్స్ ఫర్ మాస్టర్ క్లాసెస్ విభాగంలో మాయాబజార్ సినిమాను ప్రదర్శించనున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది ఉత్తమ చిత్రం కోసం ఐబీఎన్ నిర్వహించిన ఓ సర్వేలో మాయాబజార్ 1వ స్థానంలో నిలిచి తెలుగు చిత్ర పరిశ్రమ ఔనత్యాన్ని, ప్రాభావాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పింది. ఇక డిసెంబర్ 4 నుంచి హైదరాబాద్ లో నిర్వహించనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో కూడా మాయాబజార్ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాలినీ రజనీష్ బుధవారం ఇక్కడ తెలిపారు. మాయాబజార్ చిత్రం 1957 మార్చి 27న విడుదలై అఖండ విజయం సాధించింది. 50 ఏళ్లు (2007లో) పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అపూర్వ, అనన్యసామాన్యమైన కళాఖండానికి 2010లో రంగులు కూడా అద్దారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ