లేటు వయసులో మోహన్ లాల్ చేసేదేంటంటే...

December 26, 2015 | 12:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Mohanlal-learns-telugu-for-NTR-movie-niharonline

మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పటికీ అక్కడ ఆయన క్రేజ్ తగ్గలేదు. ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైనా ఆయన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతాయంటే అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య అన్ని భాషల్లో హిట్ కొట్టిన దృశ్యం ఆ కోవలోనిదే. ఇక అడపాదడపా తమిళ చిత్రంలో మెరిసే ఈ మళయాళ  స్టార్ నటుడు తమిళ బ్లాక్ బస్టర్ జిల్లాలో విజయ్ కి ఫాదర్ క్యారెక్టర్ లో మెరిసిన సంగతి తెలిసిందే. త్వరలో తెలుగులోనూ సందడి చేయనున్నాడు. ప్రముఖంగా ఆయన రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు సమాచారం. అందులో ఒకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న త్రిభాషా చిత్రం కాగా, మరోకటి ఎన్టీఆర్-కొరటాల కాంబోలో రాబోయేది. యేలేటి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళంలో ఏకకాలంలో తెరకెక్కతుంది. అందులో ఆయన గౌతమి భర్తగా నటించబోతున్నాడట. ఇక ఎన్టీఆర్ చిత్రంలో ( టైటిట్ జనతా గ్యారేజ్ అనుకుంటున్నారు)లో ఓ కీలకపాత్రలో నటించనున్నాడు. గతంలో మోహన్ లాల్  గాండీవంలో  ఒక పాటకి ఎఎన్నార్, బాలయ్యల తో కలిసి స్టెప్పులేసిన విషయం తెలిసిందే.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాల్లో వరుసగా అవకాశాలు ఎక్కువగా వస్తుండటం ..  పైగా కీలక పాత్రలు కావటంతో  ఆయన తెలుగు భాష నేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడట. తెలుగు బాగా తెలిసిన ఒక వ్యక్తిని సంప్రదించిన మోహన్ లాల్ తెలుగు నేర్చుకునే పనిలో పడ్డాడట. ప్రస్తుతం పర భాషా నాయికలు అవకాశాల కోసం తెలుగు నేర్చుకునే పనిలో ఉంటే, ఓ టాప్ స్టార్ అయి ఉండి వచ్చే వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ 55 ఏళ్ల మోహన్ లాల్ కష్టపడటం విశేషమే కదా. డెడికేషన్ అంటే అది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ