మహేష్ కోసం మురగదాస్ పెద్ద త్యాగం

April 02, 2016 | 05:07 PM | 2 Views
ప్రింట్ కామెంట్
ajith-murugadoss-maheshbabu-niharonline

దర్శకుడు మురగదాస్ అంటే కోలీవుడ్ ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా బాగా పాపులారిటీ ఉంది. మెసేజ్ ఓరియంటల్ చిత్రాలతో తమిళంలో, తెలుగులో మరో వైపు బాలీవుడ్ లో కూడా స్టార్ డైరక్టర్ స్టేటస్ కొట్టేశాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. నిజానికి ఈ ప్రాజెక్టు ముందుగా అనుకుంది మహేష్ తో కాదంట, తనకు లైఫ్ ఇచ్చిన అజిత్ తోనని మురగదాస్ చెప్పుకొచ్చాడు.

                                          మురగదాస్ తొలి చిత్రం దీనా లో అజిత్ హీరో. ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఎంతో కష్టపడి రాసుకున్న ఈ కథని తనని దర్శకుడిగా పరిచయం చేసిన అజిత్ తో చెద్దామని మురగదాస్ అనుకున్నాడంట. అయితే అప్పటికే అజిత్ శివతో, విష్ణువర్థన్ తో సినిమాలు కమిట్ అవ్వటంతో సబ్జెక్టు డిలే చేయటం ఇష్టం లేక స్టార్ డమ్ ఉన్న మహేష్ చేసేందుకు సిద్ధమయిపోయాడు. అయితే ఈ సబ్జెక్టు మిస్సయిన, అజిత్ తో మాత్రం మరో సినిమా చేయాలనే గట్టి పట్టుదలతోనే మురుగదాస్ ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాదు 'రెట్టై తలా' అనే పేరుతో స్క్రిప్టు కూడా రెడీగా చేసి పెట్టుకున్నాడట, ప్రస్తుతం విష్ణువర్థన్ తో  57వ సినిమా చేస్తున్న అజిత్ ఆ వెంటనే ఈ చిత్రం చేసే అవకాశం ఉంది, ఈ లోపు మురగదాస్ మహేష్ తో సినిమా పూర్తి చేస్తాడన్న మాట.  ఈ క్రేజీ ప్రాజెక్టు ఈ యేడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ ఉండే అవకాశాలు ఉన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ