స్నేహం కోసం ఎన్టీఆర్

April 04, 2016 | 12:53 PM | 2 Views
ప్రింట్ కామెంట్
NTR-chief-guest-vijay-for-Policeodu-audio-niharonline

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ లోనే మిగతా ఇండస్ట్రీలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈమధ్య కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 25వ చిత్రం చక్రవ్యూహా కోసం గెలియా గెలియా అంటూ స్వరం అందించాడు. ఆ పాట ఇప్పుడు అక్కడ అందరి నోళ్లలో నానుతుంది. కోలీవుడ్ లో విజయ్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.అయితే ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మిగతా హీరోల్లా తెలుగులో ఇళయదళపతికి ఆదరణ రావటంలేదు. ఒక్క తుపాకీ తప్పించి విజయ్ సినిమాలేవీ తెలుగులో పెద్దగా ఆడలేదు. కథ, కథనం, ఎంత బలంగా ఉన్నా విజయ్ ఫేస్ కి ఇక్కడ వాల్యూ లేకపోవటం పెద్ద మైనస్ గా మారింది.

సూర్య, విక్రమ్ లకు హిట్లు చాలా కాలంగా లేకపోయినప్పటికీ వారి చిత్రాలకు తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. దీంతో తన తదుపరి చిత్రంతోనైనా విజయ్ తెలుగులో పాగా వేయాలని ఆలోచనలో ఉన్నాడు. ఇందుకు దిల్ రాజ్ సాయం చేయబోతున్నాడు కూడా. రాజురాణి ఫేం అట్లీ దర్శకత్వంలో నటించిన తెరి విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో ఈ చిత్ర రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. 'పోలీసోడు' పేరుతో రానున్న ఈ చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్ర తెలుగు ఆడియో వేడుకను కూడా గ్రాండ్ గా చేయాలన్న ఫ్లాన్ లో ఉన్నాడని సమాచారం. ఈ వేడుకకి ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని యోచిస్తున్నాడంట. దీంతో ఈ చిత్రంపై మరింత హైప్ వస్తుందని రాజుగారి ఆలోచన. విజయ్ కి ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. సో... స్నేహం కోసం ఎన్టీఆర్ ఖచ్ఛితంగా అటెండ్ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ