సరైనోడు ఇంటర్వెల్ బ్యాంగ్ పేలిపోనుందా?

April 02, 2016 | 05:46 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Sarrainodu-interval-1crore-niharonline

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమా భారీ అంచనాలతో రూపొందుతోంది. బన్నీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసేలా ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమే కోటి రూపాయలు ఖర్చు చేశారని అంటున్నారు. ఈ బ్యాంగ్ వలన సెకండాఫ్ పై మరింత కుతూహలం పెరగడం ఖాయమని అంటున్నారు.

                           అదలా వుంటే, ఈ సినిమా ఫస్టులుక్ వలన .. సాంగ్ టీజర్ వలన ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ఇక పాటలు కూడా మంచి మార్కులు కొట్టేసి, యూత్ లో ఆతృతను పెంచుతున్నాయి. ఈ నెల 10న వైజాగ్ లోని రామకృష్ణ బీచ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కోటి రూపాయల ఖర్చుతో ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ