నాన్నకు ప్రేమతోకు పెద్ద చిక్కు!

December 16, 2015 | 03:23 PM | 1 Views
ప్రింట్ కామెంట్
nannaku-prematho-audio-may-postponed-due-to-devi-father-died-niharonline

బాబాయ్ నందమూరి బాలకృష్ణకు ఎదురెళ్లి మరీ సంక్రాంతి బరిలో దిగాలని అనుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎట్టి పరిస్థితుల్లో తన అప్ కమింగ్ ప్రాజెక్టు నాన్నకు ప్రేమతోను రిలీజ్ చేయాలని షూటింగ్ ను కూడా ఆఘమేఘాల మీద పూర్తి చేశాడు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆడియో రిలీజ్ పెద్ద సందిగ్ధంలో పడింది. ముందుగా చెప్పిన ప్రకారం ఈ ఆడియో వేడుక జరుగుతుందా .. లేదా? అనే సందేహం వాళ్లకి కలుగుతోంది. ఈ సినిమాకి సంగీతం అందిస్తోన్న దేవిశ్రీప్రసాద్, తండ్రి చనిపోయిన బాధలో ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ - రకుల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

                               ఈ లోగా ఈ నెల 25న పాటలను ఆవిష్కరించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇంకా ఒక పాటను కంపోజ్ చేయవలసి వుందట. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆయన తండ్రి చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'నాన్నకు ప్రేమతో' ఆడియో వేడుక జరుగుతుందా .. వాయిదా పడుతుందా? అనే విషయంపై అందరిలోనూ సందేహం తలెత్తుతోంది. మరిక ఏం జరుగుతుందో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ