మొత్తానికి సస్పెన్స్ కి తెరవీడింది. విడుదల ముహుర్తానికి మూడు రోజులే ఉండటం, సెన్సార్ ఇంకా పూర్తి కాకపోవటం లాంటి టెన్షన్స్ క్రియేట్ చేసిన టెంపర్ చిత్రానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. అనుహ్యంగా ఈ చిత్ర సెన్సార్ టాక్ మంగళవారం సాయంత్రమే పూర్తయ్యిందట. అంతేకాదు ఓ రెండు మూడు కట్లతో చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించించింది. ఇక ఇన్ సైడ్ టాక్ ప్రకారం చిత్రం పక్కా బ్లాక్ బస్టర్ అంటున్నారు. చిత్రంలో ఎన్టీఆర్ కన్నింగ్ పోలీసాఫీసర్ గా తన నటన తో ఎంటర్ టైన్ చేస్తాడని చెబుతున్నారు. అంతేకాదు ఇంతకాలం తారక్ డాన్స్ కోసం కుతుహలంతో ఉన్న ఫ్యాన్స్ కి ఈ చిత్రంలో స్టెప్పులు మతిపొగడతాయట. బ్లాక్ బస్టర్ అనే పదానికి గత కొంతకాలంగా దూరంగా ఉన్న జూనియర్ కి ఈ చిత్రం ఆ దాహాన్ని తీరుస్తుందని రిపొర్ట్ ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ -ప్రకాశ్ రాజ్ ల మధ్య సన్నివేశాలు చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఓవరాల్ గా ఫామ్ లేమితో ఉన్న పూరి-తారక్ లు ఒకేసారి ఈ చిత్రంతో తమ సత్తా చూపుతారంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.