సినిమాను బిడ్డలా ప్రేమిస్తా!

February 10, 2015 | 05:37 PM | 27 Views
ప్రింట్ కామెంట్
varundhavan_badlapur_niharonline

తాను చేసే ప్రతి సినిమాను తన సొంత బిడ్డలా ప్రేమిస్తానని బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్ అంటున్నాడు. తనకు సినిమాలంటే ఎంతో ఇష్టమని ఒక రోడ్ షోలు ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. వరుణ్ దావన్ నటించిన 'బద్లాపుర్' సినిమా ఫిబ్రవరి 20న విడుదల చేయబోతోంది ఈ చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుణ్ రోడ్ షోలో పాల్గొన్నాడు. ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నాకు సినిమా అంటే విపరీతమైన పిచ్చి...దీనికోసం నేను ఏమైనా చేస్తాను. పడతాను... లేస్తాను... దేన్నయినా హ్యాపీగా తీసుకుంటాను. ఎందుకుంటే ఇది నా డ్యూటీ. ఇదే నా జీవితం... కూడా’’ అంటున్నాడు ఉధ్వేగంగా. 2012లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే సినిమాతో సినిమాలోకి అడుగు పెట్టిన వరుణ్ ధావన్ ‘హమ్టీ శర్మ కీ దుల్హనియా’, ‘మై తేరా హీరో' సినిమాలు చేశాడు. ‘ఎబిసిడి 2’ అనే డాన్స్ చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు బద్లాపూర్ సినిమాతో ప్రేక్షుకుల ముందుకు మళ్ళీ వస్తున్నాడు. బద్లాపూర్ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ కాగా నిర్మాత దినేష్ విజన్. ఇంకా ఈ సినిమాలో నవాజ్ సిద్ధికి, హుమా ఖురేషి కూడా నటిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ