ఎన్టీఆర్ కు బృందావనం తరువాత బ్లాక్ బస్టర్ అయిన సినిమా లేదనే చెప్పాలి. టెంపర్ సక్సెస్ అనుకున్నా... అనుకున్నంతగా ఆ చిత్రం కలెక్షన్లు రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడు రాబోయే సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి సుకుమార్ దర్శకత్వంలో హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు ఎన్టీఆర్. ‘నాన్నకు ప్రేమతో’ టైటిల్ తో వచ్చే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ కు ఇప్పటికే ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుండగా ఈ చిత్ర శాటిలైట్ హక్కులను జెమిని టెలివిజన్ మంచి ధర చెల్లించినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం సాటిలైట్ హక్కులను 9కోట్ల కు సొంతం చేసుకుంది. ఇది చాలా ఎక్కువ అని ఫిల్మ్ నగర్ టాక్. ఇంత రేంజ్ లో ఈ సినిమా అమ్ముడు పోయిందంటే సినిమా బాగుండవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ చెయ్యాలని సుకుమార్ చాలా కష్టపడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏ సినిమా ఈ లెవెల్ లో విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న దాఖలాలు లేవంటున్నారు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం లండన్ లోనే జరుపుకుంది. సెప్టెంబర్ 20నుండి స్పెయిన్ లో మరో షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది దాంతో చిత్ర నిర్మాణం పూర్తవుతుందంటున్నారు. జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఈ చిత్రం బృందం సన్నద్ధమవుతోంది.