బర్త్ డే స్పెషల్: జబర్దస్త్ గా నాగబాబు పుట్టిన రోజు

October 29, 2015 | 04:15 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Nagababu-birthday-celebrations-by-MAA-photos-niharonline_(8)

అక్టోబర్ 29,1961 లో జన్మించిన కొణిదెల నాగ బాబు మెగా స్టార్ చిరంజీవికి తమ్ముడు. ప్రారంభంలో నటుడిగా కొన్ని ముఖ్య పాత్రల్లో నటించినా ఆ తరువాత హీరోగా కూడా చేశారు. సినిమాలకన్నా ఈటీవీ జబర్దస్త్ జడ్జిగా ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈయనతో పాటు ఇప్పుడు కూతురు నిహారిక, కుమారుడు వరుణ్ తేజ్ కూడా బుల్లితెరపై, వెండితెరపై తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. 
       2015 సంవత్సరం నాగబాబుకు చాలా ఆనందాలు మోసుకొచ్చింది. ఎందుకంటే ఆయనలో ఇప్పుడు పుత్రోత్సాహం పొంగి పొరలి పోతోంది. తనయుడు వరుణ్ తేజ్ కంచె సినిమా సక్సెస్ ను ఈ పుట్టిన రోజున ఆనందంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. అంతే కాదు నీహారిక యాంకర్ గా అదరగొడుతూనే, ఓ సినిమాలో హీరోయిన్ గా చేయడానికి సిద్ధమైంది ఈ సంవత్సరమే. అంజనా ప్రొడక్షన్ అధినేతగా పలు చిత్రాలు నిర్మించిన నాగబాబు... చివరి చిత్రం ఆరెంజ్ తో ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు. నిర్మాతగా ఆయనకు బాగా సక్సెస్ ఇచ్చిన సినిమా బావగారు బాగున్నారా? ఆయన ప్రొడక్షన్ లో మొదటి చిత్రం రుద్రవీణ. లాభాలు తెచ్చి పెట్టకపోయినా ఈ సినిమాకు బాగా పేరు వచ్చింది. స్టాలిన్, రాధాగోపాళం, గుడుంబా శంకర్, ముగ్గురు మొనగాళ్ళు, త్రినేత్రుడు వంటి చిత్రాలు ఈయన ప్రొడక్షన్ బేనర్ లో వచ్చిన సినిమాలు. ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు తప్ప చిత్రాలు నిర్మించే ఆలోచనలకు మాత్రం స్వస్థి చెప్పినట్టు కనిపిస్తోంది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ