మన్మథుడవుతున్న నాగచైతన్య

August 25, 2015 | 12:15 PM | 5 Views
ప్రింట్ కామెంట్
nagachaitanya_parineethi_dishapatani_anupamaparameshweran_niharonline

నాగచైతన్య ఓ రీమేక్ లో నటిస్తున్నాడని ఇంతకు ముందే తెలుసుకున్నాం.... నివిన్ పాళీ హీరోగా నటించిన మలయాళ హిట్ చిత్రం 'ప్రేమం'ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.  ఈ చిత్రానికి కార్తికేయ ఫేం చందు మొండేటికి దర్శకత్వ బాధ్యతల్ని అప్పగించారు. అయితే చైతన్య ఇందులో తండ్రి నాగార్జునలా మన్మథుడు అయిపోతున్నాడట. అంటే నాగ చైతన్య ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడట. అందులో ఒక అమ్మడిని బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హీరోయిన్ పరిణీతి చోప్రాను ఒక పాత్రకు ఎంపిక చేస్తే... మలయాళీ హీరోయిన్ దిశా పటానీ ఒక రోల్ చేస్తోంది. ఇంకో అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మాయి కూడా తెలుగమ్మాయి కాకపోవడం విశేషం.  ఎప్పటి మాదిరిగా తెలుగు హీరోయిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.  ఓ కుర్రాడు యుక్త వయసులోకి వచ్చాక కాలక్రమంలో ముగ్గురితో ప్రేమలో పడతాడు. మొత్తం 15 ఏళ్ళలో ముగ్గురిని ప్రేమిస్తాడన్న మాట. అందులో ఒక స్కూల్ టీచర్ కూడా ఉంటుంది! అంటే ప్రతి అబ్బాయి అందంగా ఉండే ఓ స్కూల్ టీచర్ కో, కాలేజీ లెక్చరర్ కో ఎట్రాక్టివ్ అయిపోతాడనేది చాలా మంది దర్శకులు చూపిస్తున్నది హండ్రెస్ పర్సెంట్ వాస్తవం అని ఒప్పుకోవాల్సిందే....! ప్రేమమ్ చిత్రాన్ని హాస్యం జోడించి తెరమీద చూపించారు. ఇది అక్కడ బాగా సక్సెస్ కావడంతో దీని రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. పరిణీతి చోప్రాను స్కూల్ టీచర్ గా  ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ లో నటించిన ఒక హీరోయిన్. కథలో మలయాళ అమ్మాయితో నాగ చైతన్య ప్రేమలో పడతాడు కాబట్టి వాళ్ళనే తీసుకుంటే బాగుంటుందని ఆ హీరోయిన్ నే సెలెక్ట్ చేశారట. ప్రేమమ్ లో నివిన్ పాళీ తమిళ టీచర్ తో ప్రేమలో పడతాడు. కానీ తెలుగు వెర్షన్ లో మన నేటివిటీకి తగ్గట్టు కొద్ది మార్పులు చేర్పులు చేస్తున్నారట. నాగ చైతన్య రొమాన్సలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటాడో లేదో ఈ చిత్రం రుజువు చేస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ