సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనేది చాలా కష్టపడితేనే వస్తుంది. వారసులు కదా ఈజీగా రాణించేయొచ్చు అన్నవారికి ఇప్పుడున్న వారి పరిస్థితి ఏంటో అన్నదే పెద్ద సమాధానం. ఎంత చిన్న ఏజ్ లో వచ్చిన సరే కనీసం 30 యేళ్ల తర్వాతనే వారికి స్టార్ డమ్ వస్తూ ఉంటుంది. దీనిపై అక్కినేని నాగార్జున ఊపిరి ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
పవన్, మహేశ్. ప్రభాస్ లకు ఆ ఏజ్ తర్వాతనే స్టార్ డమ్ వచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందుకు భిన్నంగా 30 యేళ్ల లోపే స్టార్ డమ్ సంపాదించుకున్నాడని పొగిడాడు. జూనియర్ లా మంచి కథలను ఎంచుకుంటూ వెళుతుంటే స్టార్ డమ్ దానంతట అదే వస్తుందనీ, అదే విషయాన్ని తాను పిల్లలకి చెబుతూ ఉంటానని నాగ్ ఈ సందర్భంగా చెప్పాడు.
నిజానికి 'ఊపిరి' సినిమాలో కార్తీ పాత్రను ముందుగా ఎన్టీఆర్ తో చేయించాలని నాగ్ నిర్మాతలకు సూచించాడంట. వెంటనే తారక్ కి కథ వినిపించటం, అతను ఒప్పుకోవటం కూడా జరిగిపోయాయంట. ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిని చూపించినా, డేట్స్ సర్దుబాటు కాకపోవడం అది కార్తీకి చేరిందని నాగ్ చెప్పాడు. ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ మంచి డైలాగ్ డెలివరీ ఉన్న నటుడనీ, చాలా త్వరగా స్టార్ డమ్ వచ్చిందని, తననూ బాబాయ్ బాబాయ్... అని పిలుస్తాడంటూ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు నాగ్.