కన్ఫర్మ్: సర్దార్ ఆడియోలో మెగా సందడి

March 17, 2016 | 03:33 PM | 18 Views
ప్రింట్ కామెంట్
chiru-chief-guest-for-sardar-gabbar-singh-niharonline

తెలుగు కళ్లన్నీ ఇప్పుడు 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో పైనే. ప్రస్తుతం రిలీజైన ఆడియో టీజర్ తో మొదలైన ప్రభంజనం 20 దాకా కొనసాగేలా ఉంది. ఆరోజున ఆడియో వేడుక హైదరాబాద్ నోవాటెల్ లో వైభవంగా జరగనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ రానుందని ముందునుంచి చెబుతూనే వున్నారు. చిరూ చేతుల మీదుగానే ఈ ఆడియో రిలీజ్ అవ్వాలని మెగా అభిమానులు కూడా కొరుకున్నారు.

                                                    ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా రావలసిందిగా పవన్ స్వయంగా కోరడంతో, చిరూ అంగీకరించినట్టు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చిరంజీవి ఇంటికి పవన్ వెళ్లి, ఆయనతో కాసేపు మాట్లాడి రావడం జరిగింది. అలాగే చిరంజీవి కూడా ఈ మధ్య 'సర్దార్' సెట్ కి వచ్చి పవన్ తో కాసేపు ముచ్చటించి వెళ్లడం జరిగింది. అందువలన ఈ ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారనే అంతా భావిస్తున్నారు. మిగతా మెగా హీరోలు ఈ వేదికపై చేసే సందడి కోసం, అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ