మీరెప్పుడు ముఖ్యమంత్రి అవుతారు?

March 18, 2015 | 12:24 PM | 34 Views
ప్రింట్ కామెంట్
R_narayana_murthy_pawan_kalyan_niharonline

పవన్ కళ్యాన్ రేంజ్ ఏమిటో ఇప్పుడు నిర్మిస్తున్న సినిమాలను బట్టే తెలుస్తోంది. కేవలం ఆయన కోసం సినిమాలు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. అలాగే ఆయన పేరుతోనో, పాటతోనో లేదా ఆడియో ఫంక్షన్ కు రప్పించడంతోనో తమ సినిమాలను ప్రమోట్ చేసుకుందామని కూడా ఆలోచిస్తున్నారు. ఇదంతా ఆయనకు జనాల్లో ఉన్న క్రేజ్ ఏమిటో తెలుపుతోంది. నిన్న జరిగిన రేయ్ సినిమా పవనిజం సాంగ్ రిలీజ్ వేడుకలో ఆర్.నారాయణ మూర్తిని గెస్ట్ గా పిలిచి ఆయన చేతుల మీదుగా ఆ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా పుపుల్స్ స్టార్ పవన్ ను ఉద్దేశించి రెండు ముక్కలు మాట్లాడారు. ‘ఎవరో కాదు మీరెప్పుడు ముఖ్యమంత్రి అవుతారు?’ అంటూ ఆర్.నారాయణమూర్తి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాడు. ‘జనసేన అనే పార్టీని పెట్టి రాజకీయం అనే యుద్ధ రంగంలో దిగిన తర్వాత పోరాడాలి.... ముఖ్యమంత్రి పీఠంపై ఎవరినో కూర్చోపెట్టడం కాదు. మీరు ముఖ్యమంత్రి  కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకోసం ఎదురుచూస్తున్నారు. ఆరోజెప్పుడు?’ అని నేరుగా పవర్ స్టార్ ను ప్రశ్నించారు. చాలా మంది మదిలో ఉన్న ఈ ప్రశ్నను నారాయణమూర్తి బయట పెట్టారు. ఈ ప్రశ్నకు పవన్ ఏమని సమాధానం చెపుతారో వేచి చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ