పిల్ల సిద్ధం... తల్లే దొరకలేదు

October 15, 2015 | 12:42 PM | 2 Views
ప్రింట్ కామెంట్
niharika-okkamanasu-mother-charector-not-confirm-niharonline

మెగా హీరోయిన్ నీహారిక సినిమాకు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకు ‘ఒక్క మనసు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. హీరోగారూ రెడీగానే ఉన్నారు. కానీ పిల్లకు తల్లిని ఫిక్స్ చేయలేదింకా. పాత్ర పరంగా ఈ క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉందంటున్నారు. అందుకే ముందుగా ఈ సినిమా వాళ్ళ దృష్టిలోకి నీలాంబరి... కాదు కాదు శివగామి గుర్తుకొచ్చేసింది. ఆమెనే అప్రోచ్ అవుదామనుకుంటున్నారు. కానీ వారు ఇచ్చుకునే రెమ్యునరేషన్ కు ఈవిడను తెచ్చుకోగలమా లేదా అనే విషయమై సంశయిస్తున్నారు.  
మెగాస్టార్ సరసన పలు సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ. అప్పట్లో నాగబాబు పక్కన కౌరవుడు చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించింది. మెగా బ్రదర్స్ ఇద్దరి పక్కన హీరోయిన్ గా చేసిన రమ్యకృష్ణని, ఇప్పుడు మెగాడాటర్ కి మదర్ గా నటిస్తే బాగుంటుందని ఈ సినిమా వాళ్ళు అనుకుంటున్నారు. రమ్య కృష్ణ ఖచ్చితంగా ఈ పాత్రలైతేనే నటించాలి అనే నియమాలేమీ ఉండవనేది చాలా సినిమాలు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. అల్లరి నరేష్ కు అత్తగారిగానూ, ప్రకాష్ రాజ్ కు భార్యగానూ... మామూలు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఓ మోస్తరు హీరోలకు తల్లిగా కూడా చేసింది. మరి నీహారిక తల్లి పాత్రకు కూడా ఒప్పుకుంటుందేమో చూడాలి.  రామరాజు దర్శకత్వం వహిస్తున్న ‘ఒక్క మనసు’ సినిమాను ఈ నెల 30న మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ గ్రాండ్ గా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ