మొదటి సినిమా నుంచీ తన టాలెంట్ ఏమిటో చాటుతూ వస్తున్న మళయాళ కుట్టి నిత్యామీనన్. అలా మొదలైందితోనే పెద్ద సంఖ్యలో తెలుగు అభిమానుల్ని సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు, మళయాళ, తమిళ భాషల్లో బోలెడు ఆఫర్లను దక్కించుకుంటోంది. అయితే సినిమాలను ఎంచుకోవడంలో ఆమె పంథా వేరుగా ఉందట. ఏ సినిమా వాళ్ళయినా తనకు సినిమా ఆఫర్ ఇస్తే... వారికి రెండు షరతులు పెడుతోందట. అవి ఒకటి... కథానాయకుడికి సమానంగా తన పాత్ర ఉండాలట, రెండవది ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు రెట్టింపు ఇవ్వాలట. ఈ రెండు షరతులు అంగీకరిస్తే కథ చెప్ప మంటోందట. ఇంకేముంది కథ విషయంలో ముందుగానే క్లారిటీ ఇచ్చింది కాబట్టి, ఆమె అడిగిన దానికి భిన్నంగా కథ ఉన్నా మొదటి సారికే వెనుదిరుగుతారు. లేదా కథ ఆమె అడిగిన దానికి దగ్గరగా ఉన్నా రెమ్యునరేషన్ ఇచ్చుకోలేకపోతే వెనుదిరుగుతారు. ఈ కండిషన్లతో కూడా ఆమెకు అనుకున్నంత పాపులారిటీ రావడం లేదని అనుకుంటున్నారు మల్లూవుడ్ లో... ఇక ఎక్స్ పోజింగ్ విషయంలో ఇంతకుముందే చెప్పేసింది కాబట్టి ఇవన్నీ ఒకే అనుకుంటేనే ఆమె దగ్గరకు వెళుతున్నారు దర్శక నిర్మాతలు. ఇలా షరతులు పెట్టడం వల్ల ఛాన్స్ లు పోతే మాత్రం ఆమెకుండే ప్రత్యేకత ఏ హీరోయిన్ కూ ఉండదు కదా... దట్ ఈజ్ నిత్యా మీనన్.