ప్రారంభంలో గ్లామరస్ పాత్రలను చేసి అద గొట్టిన టబూ... ఇటీవల కేవలం సీరియస్ పాత్రలకే పరిమితమై పోయింది. ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోయి సత్తా ఉన్న నటి టబు. అందుకే ఆమెను రెండు మూడుసార్లు జాతీయ అవార్డులు వరించాయి. ఇంత వయసొచ్చినా అందాల ఆరబోతలో తానూ తీసిపోనంటోంది ఈ అమ్మడు. `హెరా ఫెరీ` `బివినెంబర్ వన్` చిత్రాలతో తన సత్తా ఏమిటో మరోసారి చాటి చెప్పింది టబు. సరైన పాత్రలు అప్పజెబితే మరింతగా అదరగొడతాననీ, కానీ నేటి దర్శకులకు నన్ను వెరైటీ పాత్రల్లో చూపించడానికి ఆసక్తి చూపడం లేదనీ, నన్ను కేవలం సీరియస్ పాత్రలే చేయమంటున్నారని వాపోయింది. నేనలాంటి పాత్రలకే సరిపోతానని వాళ్లు అనుకోవడం వారి భ్రమ అని ఆవేదన వ్యక్తం చేసింది. దమ్మున్న పాత్రల్ని ఇచ్చి చూడండని ఆమె నేటితరం దర్శకులకు సవాల్ విసురుతోంది. హిందీ `దృశ్యం`లో ఆమె కీలక పాత్ర పోషించింది. తెలుగులో నదియా పోషించిన పోలీసు పాత్రని టబు హిందీలో చేసింది. పెళ్ళి ఊసెత్తకుండా సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేసింది. పరిశ్రమలో ఉంటూ వ్యక్తుల అంతరంగాల్ని పరిశీలించే అవకాశం దొరికందని ఆమె తెలుపుతోంది. కూలీ నెంబర్ 1తో తెలుగులో అడుగు పెట్టిన టబు అటు తరువాత బాలీవుడ్ ఆఫర్లని చేజిక్కించుకుంది. అజయ్ దేవగన్ తో ఎక్కువ సినిమాలు చేసింది. `నిన్నే పెళ్లాడతా`లో చేసిన పాత్రతో పాటు `మాచిస్` `చాందినీబార్` లాంటి సినిమాల కోసం టబు ఎదురు చూస్తోందట. తెలుగులో కూడా ఆ మధ్య చిరంజీవి ‘అందరి వాడు’, బాలకృష్ణ తో ‘పాండురంగడు’ సినిమాల్లో సీనియర్ పాత్రలో నటించింది.