కృష్ణా జిల్లాలో బాహుబలి చిత్రానికి సంబంధించి 30 బెనిఫిట్ ‘షో’ల ద్వారా అందిన మొత్తాన్ని తాను ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తానని సాయి కొర్రపాటి మాట ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారు. ఆ బెనిఫిట్ ‘షో’ల ద్వారా వచ్చిన 24 లక్షల 56 వేల 789 రూపాయల మొత్తాన్ని ఆయన చెక్కు రూపంలో ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణికి అందజేశారు. ఇందుకు బ్రాహ్మణి ఆయనను అభినందించారు. కానీ అసలైన వారు లేకుండా నారా బ్రహ్మిణి చెక్కుతీసుకోవడంపై పలువురు ఇక ఈ కుటుంబంలో మరో లీడర్ రాబోతోందా? అని అనుకుంటున్నారు.