ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నిత్యమీనన్, సల్మాన్ దుల్కర్ జంటగా నటించిన ఓకే బంగారానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు కూర్చారు. అసలే ఓ రొమాంటిక్ సినిమా... దానికి రెహ్మాన్ స్వరాలందిస్తే... ఇంకేముంది ఇక అందరి నోర్లలోనూ ఈ పాటలే ఆడుతుంటాయి. ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఆడియో సక్సెస్‌మీట్‌ను హైద్రాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మణిరత్నం, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీత దర్శకుడు రెహమాన్, హీరో నాని, హీరోయిన్ నిత్య మీనన్, నటుడు ప్రకాష్ రాజ్, నిర్మాత దిల్‌రాజ్ హాజరై, సినిమా గురించి పాటల గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ... ‘ఓకే బంగారం సినిమా మణిరత్నంగారు తీస్తున్నప్పటినుంచీ చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. దానికి మా అన్నయ్య ప్రకాష్ రాజ్ తెలుగులో చేయటానికి అందరితోనూ మాట్లాడి సినిమా నాకు ఇప్పించారు. నేను టీనేజ్ లో ఉన్నప్పుడు గీతాంజలి చిత్రం 12 సార్లు చూసాను. మీ సఖి సినిమాను నైజాం డిస్ట్రిబ్యూట్ చేసాను.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మీ సినిమా అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. సిరి వెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ- మణిరత్నం, ఎఆర్ రెహ్మాన్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్ వీళ్ల నలుగురుకీ ఓ ప్రత్యేకత ఉంది. వీళ్లని తెలుగు వారు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. ఈ రోజున ఓకే బంగారం అనే డబ్బింగ్ సినిమా తాలుకు పాటలు రిలీజ్ అవటం లేదు స్ట్రైయిట్ తెలుగు పాటలే రిలీజ్ అవుతున్నాయి అన్నారు. హీరో నాని మాట్లాడుతూ- నేనే ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ ని. సినిమా చూసిన వెంటనే దిల్ రాజు గారికి ఫోన్ చేసి చెప్పాను. చాలా భయంకరమైన కుళ్లు వచ్చేసింది. ఈ సినిమాలో నేనే హీరోగా చేస్తే, దుల్కర్ మళయాళంలో డబ్బింగ్ చెప్తే బాగుండేది అనిపించింది అన్నారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ- ఆయన నాకు చాలా ఇష్టం. వ్యక్తిగా. ప్రొడ్యూసర్ రిలేషన్ కాదు. జీవితంలో ఇద్దరు కలిసి ప్రయాణం చెయ్యాలంటే ఆయన ఆలోచనలు కలవాలి. అలాంటి ఓపెన్ హార్ట్ నాకు నచ్చుతుంది. ఓకే బంగారం గురించి చెప్పాలంటే మణి సార్ కు నాకు ఓ గొప్ప జర్నీ జరిగింది. రోజా చేసాను. ఎప్పుడో ఓ పెద్ద నటుడు అవ్వాలి అనుకుని కలలు కనేటప్పుడు. మణి సార్ ద్వారా నిజమైంది. నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఇంకా చేయగలవు అనే నమ్మకం ఉంది అని చేయించుకునే వారు అన్నారు. నిత్యామీనన్ మాట్లాడుతూ- ఓ కమిట్ మెంట్ తో ఇద్దరం కలిసి చేసాము. ఇది ఓ నైస్ లుకింగ్ ఫిల్మ్. ఓ క్రియేటివ్ పర్సన్ గా నన్ను మూవ్ చేసింది‘ అన్నారు. మణిరత్నం మాట్లాడుతూ- ప్రతీ సారి నెక్ట్స్ టైమ్ తెలుగులో మాట్లాడతాను అని చెప్తాను. అందుకే ఈ సారి ఫుల్ స్పీచ్ తో వచ్చాను. కానీ మరింతగా ప్రాక్టీస్ చేసుకుని వస్తాను. సీతారామ శాస్త్రిగారితో చేయటం చాలా గ్రేట్ గా ఫీలవుతునున్నాను. రెహ్మాన్ సంగీతం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. బంగారం ని దిల్ రాజు చేతిలో పెట్టాను. ఆయనే కేర్ తీసుకుంటారు. నిత్యా, దుల్కర్ వెరీ టాలెంటెండ్ పీపుల్. ఎఆర్ రహమాన్ మాట్లాడుతూ- తెలుగు తెలుసు కానీ కరెక్టు తెలుగు మాట్లాడలేను. అర్దం చేసుకోగలను. మణి గారు ఓ మెంటర్, బ్రదర్ అన్నీ నాకు. ఓకే బంగారం పాటలు వెరీ వెరీ స్పెషల్. ఆడియన్స్ అందరికీ ధాంక్స్ అన్నారు.
దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటో గ్రాఫర్‌గా పని చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం.